ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో దసరా పండుగ రోజు పిడుగుపడి మృత్యువాత పడిన మూడు బాధిత కుటుంబాలను ఎంపీ నామా నాగేశ్వరరావు పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల సాయాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పసుపులేటి దుర్గతోపాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె