ETV Bharat / state

దశాబ్ధాల నాటి సమస్య.. ఎంపీ మాటతో పరిష్కారం

తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని వ్యాపార వాణిజ్య కేంద్రంగా విరజిల్లుతున్న మధిరలో దశాబ్ధాల కాలంగా ఉన్న ప్రధాన సమస్యకు తెరాస లోక్​సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అక్కడి పట్టణ వాసులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేంటో మీరూ తెలుసుకోండి.

MP Nageshwara Rao promised to Madhira residents in khammam district
దశాబ్ధాల నాటి సమస్య.. ఎంపీ మాటతో పరిష్కారం
author img

By

Published : Jun 24, 2020, 1:50 PM IST

ఖమ్మం జిల్లా మధిర పురపాలకలో రైల్వేగేటును పూర్తిగా మూసివేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటవ పట్టణం నుంచి రెండో పట్టణం వైపుకు వెళ్లాలంటే.. సుందరయ్య నగర్​ కూడలి నుంచి కాంగ్రెస్​ కార్యాలయం వరకు ఉన్న రైల్వే ఓవర్​ బ్రిడ్జి దాటి వెళ్లాల్సిన పరిస్థితి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మధిర పట్టణవాసులు... పట్టణం ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

ప్రధానంగా సమీపంలోని ఆంధ్రప్రదేశ్​ సరిసద్దు గ్రామాల నుంచి కూడా వివిధ క్రయవిక్రయాల నిమిత్తం వ్యాపార లావాదేవీల కోసం మధిరకు వచ్చి వెళ్తున్నారు. రైతులు సైతం వ్యవసాయ పురుగు మందులు ఎరువుల కోసం వస్తుంటారు. అయితే పట్టణంలో చిన్నపాటి ఇరుకుగా ఉన్న ఆర్​యూబీ వెడల్పు చేస్తే.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్నారు.

లోక్​సభ ఎన్నికల సమయంలో మధిర ప్రచారానికి వచ్చిన నామ నాగేశ్వరరావుకు ఈ సమస్యను ప్రజలు విన్నవించుకున్నారు. అప్పట్లోనే ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇరుకు ఆర్​యూబీని వెడల్పు చేసేందుకు ఎంపీ నామ నాగేశ్వరరావు పట్టుబట్టి మరీ రైల్వే ఉన్నతాధికారులను ఒప్పించారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉండటం వల్ల మధిర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ నామ మాట ఇచ్చారంటే.. చేసి చూపెడతారంటూ.. అన్ని వర్గాల ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రికి కేటీఆర్​ కృతజ్ఞతలు.. ట్వీట్ చేసిన మంత్రి​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.