కొవిడ్-19 కారణంగా భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురవుతాయని.... వాటిని అధిగమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సి రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో లాక్‌డౌన్‌తో ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. బీపీఎల్ కుటుంబానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'అలుపన్నదే లేకుండా పోరాడితేనే కరోనాపై విజయం'