ఉద్యోగ భర్తీకి హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చలేకపోయిందని ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డా.చెరుకు సుధాకర్ ఆరోపించారు. ఖమ్మం నగరంలో ప్రచారం నిర్వహించిన సుధాకర్.. నడకకు వెళ్లిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు.
తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేసిన సుధాకర్.. ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని తెలిపారు. విద్యాధికులు తన ప్రచారానికి సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు.
- ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం