నిరుపేదలకు ఉచితవైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం సర్కారు అహర్నిశలు కృషిచేస్తుంటే.. చెడ్డపేరు వచ్చేలా సిబ్బంది ప్రవర్తిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఇటీవల రోగులకు సెక్యూరిటీ గార్డు వైద్యం చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది, ఉద్యోగులున్నా.. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మల్యే స్పష్టం చేశారు. డీఎంహెచ్వో, ఇతర వైద్య అధికారులతో కలిసి ఆస్పత్రిని ఎమ్మెల్యే అజయ్ కుమార్ సందర్శించారు.
ఇవీ చూడండి: అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ