ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన తెలంగాణగా రాష్ట్రం ఉండాలనే కేసీఆర్ సంకల్పాన్ని నిజం చేయాలని సూచించారు.
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దాలని... దాతల సహకారంతో జూట్ సంచులు పంపిణీ చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని పెద్ద పంచాయతీలను ప్రత్యేక ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేయాలని వెల్లడించారు.
ఇవీ చూడండి: కరోనాపై మోదీ సమీక్ష- భయపడొద్దని సూచన