సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. పండుగలు సంతోషంగా నిర్వహించుకునే విధంగా తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చీరల పంపిణీ ఇంటింటికి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ ప్రమీల ఆర్డీఓ సూర్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్