ETV Bharat / state

ఇంటికే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు

సంక్షేమ పథకాల చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందించే కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

mla sandra handed over the checks of Kalyana Lakshmi and Shadi Mubarak at houses of beneficiaries
ఇంటికే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు
author img

By

Published : Feb 10, 2021, 7:44 PM IST

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించి.. వారి కళ్లల్లో ఆనందం చూడటం కోసమే 'ఇంటికి చెక్కుల పంపిణీ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులతో పాటు చీరలను బహుకరించారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నట్లే.. ప్రభుత్వం ఇక నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కూడా నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోహన్, ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మణ్‌, తహసీల్దార్ రమాదేవి, సర్పంచ్ జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'తెలంగాణపై అవగాహన లేని వారు వచ్చి విమర్శలు చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.