అటవీ శాఖ అధికారులపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నర్సరీల పెంపకంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని దీనిపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు... అటవీ, రెవెన్యూ శాఖలు ఉమ్మడిగా సర్వే చేశారు. సర్వే చేసి నెల గడిచినా ఇప్పటివరకు వరకు ప్రభుత్వ భూములపై స్పష్టత రాలేదు.
అటవీ శాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ భూమి ఎంత ఉందో లెక్క తేలట్లేదని రేగా కాంతారావు ఆరోపించారు. ప్రభుత్వ భూములను కూడా అటవీశాఖ అటవీ భూములుగా నిర్ధారిస్తోందన్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ శాఖ అధీనంలో ఉందని తెలిపారు. ఆ భూమిని గిరిజనులకు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!