ఖమ్మం జిల్లా వైరాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలోని సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే రాములు నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో హరితహారం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమస్యలపై ఏకరవు పెట్టారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన భవనాలు మంజూరుచేయాలని కోరారు. శిథిలావస్థకు చేరిన పైకప్పుల గదులను విద్యార్థులు స్వయంగా ఎమ్మెల్యేకు చూపించారు. సమస్యల పూర్తి వివరాలను తనకు అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుకు ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: వివాదాలు లేని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సై: హైకోర్టులో ఈసీ