ETV Bharat / state

సమస్యలు చెబుతూ ఎమ్మెల్యే వద్ద కన్నీరుపెట్టిన విద్యార్థినులు

హరితహారంలో కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు వచ్చిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ వద్ద కేజీబీవీ విద్యార్థినులు కంటతడిపెట్టారు. అసౌకర్యాల నడుమ కాలం గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలను ఓదార్చిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సమస్యలు చెబుతూ ఎమ్మెల్యే వద్ద కన్నీరుపెట్టిన విద్యార్థినిలు
author img

By

Published : Jul 25, 2019, 11:02 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరులో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏన్కూరు వచ్చిన ఎమ్మెల్యేకు కేజీబీవీ విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు 300 మందికి కేవలం 10 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయంటూ ఎమ్మెల్యే ఎదుట కంటతడిపెట్టారు. వసతి గృహంలోనూ అసౌకర్యాలున్నట్లు రాములునాయక్​ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి కాలినడకనే పాఠశాలకు చేరుకున్నారు. కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థినులను ఓదార్చి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎస్​వోను ఆదేశించారు.

సమస్యలు చెబుతూ ఎమ్మెల్యే వద్ద కన్నీరుపెట్టిన విద్యార్థినిలు

ఇవీ చూడండి: ఊరంతా ఏకమైంది.. గ్రామబడిని బతికించుకుంది...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.