ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాములు నాయక్, టీఎస్ మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ ప్రారంభించారు. భయానక సమయంలో రైతులకు మేమున్నామంటూ ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రెట్టింపు స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీకి అందుబాటులో తెచ్చామని తెలిపారు.
దళారులను ఆశ్రయించుకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. రవాణాకు సరిపడా లారీలు, ఎగుమతులకు గన్నీ సంచుల కొరత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు.