ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని కామేపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే హరిప్రియ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా కామేపల్లి మండల కేంద్రంలోని పెద్దచెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం 42 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి.. మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, సర్పంచ్ రాందాస్, ఎంపీడీవో సత్యనారాయణ, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం