ఖమ్మం జిల్లా పలు మండలాల్లోని ఐసోలేషన్ కేంద్రాలలో భోజనాలు పంపిణీ చేసి… మద్దులపల్లి ఐసోలేషన్ కేంద్రం ఆవరణలోనే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భోజనం చేశారు. కరోనా పేషెంట్స్‌కు ధైర్యం చెబుతూ వారికి భోజనాలు అందజేశారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఏఎంసీ ఛైర్మన్ హరి సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొవిడ్ బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొందరు బాధితులు అస్వస్థతలోనూ ఐసోలేషన్ కేంద్రాలకు రావడంలో జాప్యం చేస్తున్నారని… అలాంటి వారి కోసం వారి ఇంట్లోనే పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. కరోనా బాధితులు ధైర్యంతో ఉండాలని, వైద్యులు సూచించిన ప్రకారం మందులు, ఆహారం తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: ధాన్యం కొనుగోళ్లపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి: మారెడ్డి