ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో 500 మంది వలస కూలీలు, గొర్రెల పెంపకందారులు, వికలాంగులకు ఎమ్మెల్యే హరిప్రియ నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించినందున ప్రజలు సహకరించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. పలువురు దాతలు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలను ఆదుకోవటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్, ఎంపీపీ సునీత, పీఎసీఎస్ అధ్యక్షులు హనుమంతరావు, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.