మిర్చి పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిందీ ఘటన. జెండా పాట రూ. 14 వేల 700గా పెట్టి.. వ్యాపారులు తమ వద్ద నుంచి కేవలం రూ. 11 వేలకు మించకుండా కొనుగోలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ మార్కెట్ ఛైర్మన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
తేమ శాతం, నాణ్యతను సాకుగా చూపి పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్కు ఎక్కువ పంట వచ్చిన ప్రతీసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని వాపోయారు. మార్కెట్కు.. ఈ సీజన్లో ఎన్నడూ లేనంతగా ఏకంగా లక్షా 10 వేల బస్తాల మిర్చి చేరింది.
ఇదీ చదవండి: తెలంగాణపై కొవిడ్ పంజా.. 39,154 యాక్టివ్ కేసులు