ETV Bharat / state

మిర్చి మంటలు - జెండాట కొండంత - వ్యాపారుల ధర గోరంత - khammam mirchi Market

Mirchi Crop Price Telangana 2024 : ఖమ్మం మిర్చి మార్కెట్​లో వ్యాపారుల ధరల దగాతో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి నిరీక్షిస్తున్న కర్షకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పలువురు రైతులు పంటను వెనక్కి తీసుకెళ్తున్న దుస్థితి ఏర్పడింది.

Farmers Price Problems in Khammam
Mirchi Farmers Price Problems in Khammam
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 11:56 AM IST

జెండాట కొండంత వ్యాపారుల ధర గోరంత మిర్చి రైతులకు తప్పని బాధ

Mirchi Crop Price Telangana 2024 : సీజన్ ఆరంభంలో ఖమ్మం మిర్చి మార్కెట్‌లో ధరల దగా అన్నదాతకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సీజన్ ఆరంభం నుంచి అనేక కష్టాలు నష్టాలే మిర్చి రైతును వెంటాడుతున్నాయి. అధిక వర్షాలు, తెగుళ్లతో దిగబడులు గణనీయంగా తగ్గగా పంట చేతికొచ్చే సమయంలో మిగ్​జాం తుపాను రైతుల్ని నట్టేటముంచింది. మిగిలిన కొద్ది పంటను తీసుకొచ్చిన కర్షకులను మార్కెట్ మాయాజాలం నిండా ముంచుతోంది.

ఈయన పేరు వెంకట్ రెడ్డి తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు. ఎకరంలో మిర్చి సాగు చేశారు. 8బస్తాల దిగుబడిరాగా అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చాడు. మార్కెట్‌లో జెండాపాట రూ.23 వేల 150 పలకగా, వ్యాపారులు మాత్రం రూ.13 నుంచి రూ.14 వేలకు మించి అడగలేదు. అంత తక్కువకు ఇవ్వనని చెప్పిన అతను మూడ్రోజులుగా అక్కడే పడిగాపులు పడుతున్నాడు. మార్కెట్‌లో పేరుకే జెండా పాటలున్నాయని, దారుణంగా తగ్గించి కొంటున్నారని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

Khammam Mirchi Market: మిర్చి రైతుల కష్టాలు తీరేదెన్నడు...?

15 రోజులుగా ఖమ్మం మార్కెట్‌కి రైతులు మిర్చి తీసుకొస్తున్నారు. వారం నుంచి రోజుకు 10వేల బస్తాలకుపైగానే వస్తోంది. గురువారం దాదాపు 15 వేల బస్తాల వరకు తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల్ని నిండా ముంచుతున్నారు. వాస్తవానికి గురువారం మార్కెట్‌లో ఎండు మిర్చి జెండాపాట రూ.23వేల 150 గా నిర్ణయించగా రైతులు సంబరపడ్డారు. తీరా కొనుగోళ్లు మొదలయ్యాక వ్యాపారుల మాయాజాలం బయటపడింది.

"జెండా పాట చూసి ఇక్కడికి వచ్చాం. అది 23వేలు ఉంటే ఇక్కడ మాత్రం 16 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఇలాగే తక్కువ ధరకు అమ్మితే మాకు పురుగుల మందే దిక్కు." - రైతులు

మిర్చికి రికార్డు స్థాయిలో ధర కానీ.. ఆందోళనలో రైతులు..?

పంటను అమ్ముకునేందుకు వస్తున్న అన్నదాత పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మార్కెట్​లో క్రయవిక్రయాలపై పాలకవర్గం, మార్కెట్ యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. మార్కెట్ పాలక వర్గం పట్టించుకోకపోవడంతోపాటు మార్కెట్ కార్యదర్శి బదిలీ కావడంతో మార్కెట్ లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. జెండాపాట ధరలు ఘనంగా ఉంటున్నా, కర్షకునికి మాత్రం దక్కిన దాఖలాలే కనిపించడం లేదు. మార్కెట్​లో మిర్చి ధరలు అమాంతం పెరిగాయంటూ ఊదరగొట్టడం, జెండాపాట అత్యధిక ధర పలికిందంటూ ప్రకటించడంతో, భారీగా రైతులు మిర్చిని మార్కెట్​కు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. తీరా మార్కెట్​కు మిర్చి అత్యధికంగా రాగానే, అమాంతం ధరలు తగ్గించి కొనడం వ్యాపారుల ఇష్టారాజ్యానికి తార్కాణంగా నిలుస్తోంది.

Red Chilli Price : మిర్చి చరిత్రలో గరిష్ఠ ధర.. రైతులకు మిగిలేది ఎంతంటే..

పంట ఎక్కువ రావడంతో నాణ్యత, రంగుసాకు చూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. మంచి రకం మిర్చికి రూ.15వేలు దాటకపోవడంతో రైతులు ప్రశ్నించగా, అసలు మిర్చి కొనేదిలేదని వ్యాపారులు వెళ్లిపోయారు. ఖమ్మం మార్కెట్‌లో జరుగుతున్న మాయాజాలంపై వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

chilli farmers suicides: అత్యంత దయనీయంగా మిర్చి రైతు పరిస్థితి.. వారంలో ముగ్గురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.