ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీల్లచెరువు సమీపంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిని మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...