దిశ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మొదటి సారి నేను ఎందుకు పోలీస్ కాలేక పోయానా అని బాధ పడుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి సత్వర న్యాయం జరుగుతుందని ఎప్పుడూ ధర్మమే గెలుస్తుందని తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్ ఘటన ద్వారా దేశానికే రాష్ట్రం ఒక రోల్ మోడల్లా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చూస్తే కళ్లు పీకి చూపిస్తాం అని సీఎం కేసీఆర్ ఒకప్పుడు చెప్పిన మాటలు తూటాల్లాగా ఖచ్చితంగా నెరవేరుతున్నాయని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని పువ్వాడ తెలిపారు.
ఇదీ చూడండి: దిశ ఘటనా స్థలానికి 400 మీటర్లలోనే ఎన్‌కౌంటర్