ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి రెండో జోన్‌కు... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని 17 మండలాల్లో 2.52 లక్షల ఎకరాలకు నాగార్జునసాగర్ జలాలు అందిచనున్నారు. వరినాట్లకు సిద్ధమవుతున్న రైతులకు ఈ నీటిని 25 రోజుల పాటు విడుదల చేయనున్నారు. తర్వాత వారబందీ విధానంలో ఇవ్వనున్నారు.
దశాబ్ధకాలంలో ముందస్తుగా నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్‌కు నాగార్జునసాగర్ కెనాల్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... నీటిమట్టం 20 అడుగులకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, ఎన్నెస్పీ డీఈ మన్మధరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్