కరోనా కట్టడిని ప్రతి ప్రభుత్వాధికారి బాధ్యతగా భావించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి కరోనాపై సమీక్షించారు.
ఖమ్మంలో ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఎందుకు ఇచ్చారంటూ అధికారుల్ని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు నడుస్తున్న అంగన్ వాడీ కేంద్రాలు వెంటనే నిలిపివేయాలని సూచించారు. విదేశాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. మతపరమైన కార్యక్రమాలు, జాతరలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఈనెల 31 వరకు వాయిదా వేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. శానిటైజర్లు, మాస్క్‌లు ఉచితంగా పంపిణీ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు.
ఇదీ చూడండి: భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం