ETV Bharat / state

సీతారామతో ఉభయ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి పువ్వాడ - మంత్రి పువ్వాడ

ఓ వైపు కొవిడ్ నిబంధనలు.. మరోవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం.. వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా సాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో ఏ విధమైన సంబరాలు లేకుండానే మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది.

ప్రభుత్వ, పార్టీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ, జడ్పీ ఛైర్మన్

author img

By

Published : Aug 15, 2020, 5:21 PM IST

ఏటా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జరగాల్సిన స్వాతంత్ర వేడుకలు.. ఈసారి కరోనా ప్రభావంతో జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించారు. అతి కొద్దిమందితోనే వేడుకలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనప్పటికీ.. ఏకధాటిగా వర్షం కురవడం వల్ల సాదాసీదాగా నిర్వహించాల్సి వచ్చింది.

కలెక్టరేట్​లో మంత్రి జెండా ఆవిష్కరణ...

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. పరేడ్, ఉపన్యాసం లేనందున జిల్లా ప్రగతి నివేదిక విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేస్తోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి పునరంకితమై పని చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవతంగా పూర్తి చేసి లక్ష్యాలు చేరుకుంటామన్నారు.

వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి ముందే...

జిల్లాకు తలమానికమైన సీతారామ ప్రాజెక్టును వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి ముందే.. గోదావరి జలాలను ఉభయ జిల్లాల అన్నదాతలకు అందిస్తామని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు.

జెండా ఎగురవేసిన జడ్పీ...

ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగుర వేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఛైర్మన్ లింగాల కమల్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఎన్టీఆర్ భవన్​లో పార్లమెంటరీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు జాతీయ జెండాకు వందనం చేశారు.

ఇవీ చూడండి : శిథిలావస్థలో ఉన్న భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్​ఎంసీ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.