ETV Bharat / state

ఖమ్మంలో పట్టణ ప్రగతిని ప్రారంభించిన మంత్రి పువ్వాడ - సీజనల్​ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామన్న పువ్వాడ వార్తలు

వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Minister Puvvada ajay kumar started pattana pragathi program in Khammam
ఖమ్మంలో పట్టణప్రగతిని ప్రారంభించిన మంత్రి పువ్వాడ
author img

By

Published : Jun 1, 2020, 12:56 PM IST

పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్‌లో మురుగు కాల్వలుగా మారిన గొలుసుకట్టు చెరువుల్లో పూడికతీత పనులను ప్రారంభించారు.

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రజలకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. మురుగు కాలువల్లో పూడిక తీసి.. దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రగతితో పాటు గ్రామాల్లోనూ దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ డా.పాపాలాల్‌, కలెక్టర్‌ ఆర్​.వి.కర్ణన్‌, మున్సిపల్​ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: మిడతల ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిరంజన్​ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.