పల్లెను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా మంత్రి అజయ్ కుమార్ హెచ్చరించారు. ఖమ్మంలో రఘునాథపాలెం మండలంలోని సర్పంచులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్షించారు. గ్రామాల్లో హరితహారం, ఇంకుడు గుంతలు, మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకొని అభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులను ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఆర్డీఏ పీడీ ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వచ్చే ఏడాదితో హరితహారం లక్ష్యం పూర్తి చేస్తాం: ఇంద్రకరణ్ రెడ్డి
గ్రామాల అభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులతో మంత్రి సమీక్ష
ఖమ్మంలో రఘునాథపాలెం మండలంలోని సర్పంచులు, కార్యదర్శులతో మంత్రి అజయ్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లెను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.