అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం చాలా అరుదు. అయితే ఓ ఉన్నతాధికారి ఏకంగా సర్కార్ దవాఖానాలో ప్రసవించి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమే ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత(Sneha latha mogili ias). ఐఏఎస్ స్నేహలత, భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ శబరీస్ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. వీరిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.
పేదల గుడి అయిన ప్రభుత్వ ఆస్పత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని మంత్రి అన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత(Sneha latha mogili ias) దంపతులు ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు పొందారు. సర్కార్ దవాఖానాలో ప్రసవించి... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచారని పలువురు ప్రశంసిస్తున్నారు.
అదనపు కలెక్టర్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మిప్రసన్న, డీఎంహెచ్వో మాలతి, సూడా ఛైర్మన్ విజయ్, వైద్యులు తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: Lovers Suicide: ప్రియురాలికి పెళ్లి కుదిరిందని.. ప్రేమజంట ఆత్మహత్య