పేద ప్రజలందరికీ 57 రకాల వ్యాధి నిర్ధరణ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మరుసటి రోజే రిపోర్టు ఇస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ వ్యాధి నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం రక్తనమూనాలను తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన వాహనాలను ప్రారంభించారు. అత్యంత అధునాతన పరికరాలతో రక్త పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.
పరీక్ష కేంద్రాల పరిసరాలను పరిశీలించిన మంత్రి.. జిల్లాలో వైద్య రంగాలు అభివృద్ధి చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. మధిర, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకలతో ఆసుపత్రి నిర్మించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్కు పువ్వాడ ధన్యవాదాలు తెలిపారు
ఇదీ చదవండి: టాప్ టెన్ న్యూస్ @ 1 PM