ఖమ్మం జిల్లా కేంద్రంలో విలీనమైన పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని విలీన మేజర్ గ్రామపంచాయతీ ఖానాపురం హవేలిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఖానాపురం గ్రామానికి ఇప్పటికే నాలుగులైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని.. త్వరలోనే మిగిలిన పనులను పూర్తి చేస్తామని పువ్వాడ హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ కూడలి నుంచి తెరాస కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు.
ఇదీ చదవండి: సొంతింటి కల నెరవేరిన వేళ.. లబ్ధిదారుల ఆనంద హేళ