ETV Bharat / state

మేయర్‌ పదవిపై నా సతీమణికి ఆపేక్ష లేదు: పువ్వాడ ‌ - తెలంగాణ వార్తలు

మేయర్‌ పదవిపై తన సతీమణికి ఆపేక్ష లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మేయర్ పేరును అధిష్ఠానమే నిర్ణయిస్తుందని వెల్లడించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై కరపత్రం విడుదల చేశారు.

puvvada ajay kumar on khammam mayor, khammam corporation elections
ఖమ్మం మేయర్ పదవిపై పువ్వాడ క్లారిటీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు 2021
author img

By

Published : Apr 19, 2021, 12:59 PM IST

Updated : Apr 19, 2021, 1:14 PM IST

ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పోరులో తన సతీమణి వసంతలక్ష్మికి ఆసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మేయర్‌ ఎవరనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. నామినేషన్ల గడువు ముగియడంతో తన జన్మదినం రోజైన ఇవాళ్టి నుంచి ప్రచారహోరుకు ఆయన శ్రీకారం చుట్టారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండున్నరేళ్లలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై కరపత్రం విడుదల చేశారు.

నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న తెరాను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా ఉనికి ఉండబోదన్నారు. విపక్షాలు గుడ్డి విమర్శలు తప్ప అభివృద్ధి చేయలేవని ఆరోపించారు.

అయ్యప్పస్వామి ఆలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి... అనంతరం పలు డివిజన్లలో తెరాస అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం మేయర్ పదవిపై పువ్వాడ క్లారిటీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు 2021

ఇదీ చదవండి: పెరుగుతున్న కొవిడ్‌ మరణాలతో అంత్యక్రియలకు ఇబ్బందులు!

Last Updated : Apr 19, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.