ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉపాధి పనులు చేస్తున్న 35 వేల మంది కూలీలకు బత్తాయి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మాస్కులు, కూరగాయలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కూలీలకు అందజేశారు.
ఓవైపు ఎండలు మరోవైపు లాక్డౌన్తో ఇబ్బందుల్లో ఉన్న కూలీలకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసే సమయంలో కూలీలు భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మంత్రి పువ్వాడ సూచించారు.