పట్టణాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా... ఆ పథకాన్ని ఖమ్మంకు తీసుకొచ్చేది మంత్రి అజయ్‌కుమార్ అని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. 'ఆయన ఎంత దుర్మార్గుడంటే...' అంటూ నవ్వుతూ మంత్రి అజయ్‌కుమార్‌పై సెటైర్ వేశారు.
బస్టాండ్ కోసం నిధులు ఇవ్వలేదని మనసులో పెట్టుకుని గతంలో తన ఫోర్ట్పోలియో అయిన రవాణా శాఖను లాగేసుకున్నారని ప్రశాంత్‌రెడ్డి నవ్వులు పూయించారు. తన దగ్గర నుంచి ఆ ఫోర్ట్పోలియో గుంజుకుని మరి ఖమ్మం బస్టాండ్‌ను నిర్మించారని... అంటే మంత్రి అజయ్ అంత పట్టుదల గలవారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్