ETV Bharat / state

చీమలపాడు ప్రమాదంలో కుట్ర కోణం ఉంటే దర్యాప్తులో తేలుతుంది : కేటీఆర్ - Chimalapadu fire accident latest update

KTR Visited cheemalapadu fire accident Victims : ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాద ఘటన పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి.. ప్రమాదంలో కుట్ర కోణం ఏమైనా ఉందా అనేది పోలీసు దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు.

KTR Visited Chimalapadu Victims
KTR Visited Chimalapadu Victims
author img

By

Published : Apr 13, 2023, 1:42 PM IST

'చీమలపాడు ప్రమాదంలో కుట్ర కోణం ఉంటే పోలీస్ దర్యాప్తులో తేలుతుంది'

KTR Visited cheemalapadu fire accident Victims : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడులో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం వేళ జరిగిన దుర్ఘటనలో నలుగురు అసువులు బాసిన సంగతి తెలిసిందే. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. మెరుగైన చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు నిమ్స్‌లో బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

cheemalapadu fire accident Victims : నలుగురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు మంత్రులకు వివరించగా.. పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులను, నిమ్స్ అధికారులను మంత్రులు ఆదేశించారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. అధైర్యపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ఉచితంగానే అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఊహించని ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం దురదృష్టకరమని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామని తెలిపారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందా లేదా అనేది దర్యాప్తులో తెలుస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు నేడు పరిహారం అందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఇదిలా ఉండగా.. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ పరామర్శించారు. కోల్పోయిన వారిని తీసుకురాలేమని.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

''చీమలపాడులో జరిగిన ఘటన దురదృష్టకరం. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను. ప్రమాదంలో కుట్ర కోణం ఉందా లేదా అనేది పోలీస్ దర్యాప్తులో తెలుస్తుంది.'' - మంత్రి కేటీఆర్

అసలు ఏం జరిగిందంటే..: ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం రోజున బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య నేతలు వస్తుండగా.. కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. నిప్పు రవ్వలు సమీపంలోని గుడిసెపై పడగా మంటలు చెలరేగాయి. మంటల తాకిడికి గుడిసెలో ఉన్న సిలిండర్‌.. ఒక్కసారిగా పేలి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఒకరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృత్యువాతపడ్డారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను హైదరాబాద్‌ తరలించే క్రమంలో మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.

ఇవీ చూడండి..

చీమలపాడు అగ్నిప్రమాద ఘటన... నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

చీమలపాడు ఘటన.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అధికార, విపక్ష నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.