కరోనా వ్యాప్తి నియంత్రణలో ఖమ్మంకు చెందిన మధుకాన్ సంస్థ తనవంతు కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఇథనాల్ ఆధారిత శానిటైజర్‌ను మధుకాన్ షుగర్స్ తయారు చేసింది. సంస్థ ఇప్పటివరకు ఒక కోటి యాభై లక్షల విలువ చేసే శానిటైజర్, మూడు లక్షల పైగా మాస్కులను పంపిణీ చేసింది. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, 'నామ ముత్తయ్య ట్రస్ట్' ద్వారా తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వీటిని పంపిణీ చేశారు.
ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎంపీ నామ నాగేశ్వరరావు, నామ శీతయ్య, నామ భవ్య తేజ కలిశారు. తమ కంపెనీ రూపొందించిన శానిటైజర్ అందజేశారు. కరోనా నియంత్రణ కోసం మధుకాన్ ఇథనాల్ సంస్థ చేస్తున్న కృషిని కేటీఆర్ అభినందించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. కరోనా నియంత్రణలో సహకరించాలని సూచించారు.
ఇదీ చూడండి : 'ఆ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు'