ETV Bharat / state

తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి గంగుల - Minister gangula kamalakar Speech

ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో  గన్నీ సంచులు సరిపడా ఉన్నాయని మంత్రి తెలిపారు. తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Minister gangula kamalakar fires on bjp
తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి గంగుల
author img

By

Published : May 14, 2022, 2:30 PM IST

తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గన్నీ సంచులు సరిపడా ఉన్నాయని మంత్రి తెలిపారు. అన్ని కేంద్రాలకు సమానంగా గన్నీ సంచులు పంచాలని పేర్కొన్నారు. పండించిన ప్రతి ధాన్యం గింజను రైతు అమ్ముకొని.. వారి అకౌంట్లలో డబ్బులు పడే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు.

Minister gangula kamalakar fires on Central government about paddy procurement
మంత్రి గంగుల

''కొన్ని నల్గొండ, సూర్యాపేట పంపించాం. గతంలో కంటే ఇప్పుడు పంట పెరిగింది. గన్నీ సంచులు అదనంగా ఉన్నాయి. అన్ని కేంద్రాలకు సమానంగా గన్నీ సంచులు పంచాలి. రాష్ట్రంలో 4 కోట్లు గన్నీ సంచులు ఉన్నాయి. రైతును కొనుగోలు కేంద్రానికి పరిమితం చేయాలి. రైతులను మిల్లు వద్దకు పంపి ఇబ్బంది లేకుండా చూడాలి.''

- గంగుల కమలాకర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి

ఖమ్మంలో బీసీ స్టడీ సర్కిల్‌ను మంత్రులు గంగుల, పువ్వాడ ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీ విద్యార్థులు అన్నిరంగాల్లో ముందుకెళ్తున్నారని గంగుల అన్నారు. 2014 తర్వాత 270 గురుకులాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. గతంలో 9 వేల మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు లక్షకుపైగా చదువుకుంటున్నారని స్పష్టం చేశారు. ఒకేసారి 80 వేల నోటిఫికేషన్లు వేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక బీసీ సర్కిల్ తీసుకొస్తామన్నారు. బీసీ సర్కిల్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా లక్ష మందికి శిక్షణనిచ్చామని వివరించారు.

తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి గంగుల

ఇవీ చూడండి..:

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

'నా చిలక ఎగిరిపోయింది.. ఎలాగైనా వెతికిపెట్టండి సార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.