ETV Bharat / state

గ్రామస్థుడికి భారీ జరిమానా విధించిన మంత్రి ఎర్రబెల్లి - పువ్వాడ అజయ్ కుమార్,

ఖమ్మం జిల్లా గుబ్బగుర్తి గ్రామ పర్యటనకు వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి ఓ గ్రామస్థుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి పక్కన పరిసరాలు సరిగ్గా ఉంచుకోలేదని 5 వేల రూపాయల జరిమానా విధించారు.

గ్రామస్థుడికి భారీ జరిమానా విధించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 2, 2019, 1:27 PM IST

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాఠోడ్ పర్యటించారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా గ్రామంలో పేరుకుపోయిన చెత్తపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఓ ఇంటి యజమానికి 5 వేలు జరిమానా విధించాలని ఆధికారులను ఆదేశించారు. అనంతరం ఊళ్లో తిరుగుతూ... రోడ్డు పక్కన మద్యం సీసాలేంటని మండిపడ్డారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శిల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గ్రామస్థులందరూ కృషి చేయాలని సూచించారు. ఏన్కూరులోనూ పర్యటించిన మంత్రుల బృందం పరిశుభ్రత పాటించని కిరాణా షాపు యజమానికి, పెట్రోల్ పంపు యజమానికి 5 వేల చొప్పున జరిమానా విధించింది.

గ్రామస్థుడికి భారీ జరిమానా విధించిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.