బతుకు తెరువు కోసం తెలంగాణ వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజల బతుకులు అగమ్యగోచరంగా మారింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 40 రోజుల క్రితం ఖమ్మం జిల్లా వైరాకు వచ్చిన 22 మంది రాజస్థాన్ వాసులకు బతకడమే కష్టంగా మారిపోయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వారు తమ రాష్ట్రానికి బయలుదేరటానికి సంకల్పించుకున్నారు. దీనితో వారు కాళ్లకు పని చెప్పారు. 25 కిలోమీటర్ల ప్రయాణం చేసిన వారు శుక్రవారం రాత్రి ఖమ్మం చేరుకున్నారు. వారిని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేరదీసి భోజన వసతి కల్పించారు. లాక్‌డౌన్ అయ్యేవరకు వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..