ఖమ్మం జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఖమ్మం నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు రాత్రి భారీగా తరలివచ్చారు. వాళ్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి వారి వివరాలు తీసుకుంటున్నారు పోలీసులు.
వీరిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
ఇదీ చూడండి: మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షం.!