ఖమ్మం జిల్లా బురద రాఘవాపురంలో వలస కూలీలకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రవాసులు ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నా... ఇంటి వద్ద ఉన్న తమ పిల్లలను తలచుకుంటూ నిత్యం మనోవేదనతో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దయచేసి మే 7 తర్వాత స్వస్థలాలకు పంపిమచాలని ఓ మహిళ ఎమ్మెల్యేను వేడుకుంది. నాను కూడా బంజారా బిడ్డనేని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ఏన్కూరు, జూలూరుపాడులో ఉన్న 20 వేల మంది కూలీలను ఆధుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బియ్యం, నగదు అందని వలస కూలీలకు వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఇంకొంత కాలం లాక్డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్