రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో సహకార సంఘం ద్వారా రైతులకు మంజూరైన రూ.90 లక్షల పంట రుణాల చెక్కులను అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలు, రైతు బంధు, రైతు బీమా, సహకార సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, సబ్సిడీ యంత్ర పరికరాలు, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలతో అన్నదాతలకు భరోసాగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్సిపల్ ఛైర్మన్ జైపాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. రెవెన్యూశాఖలో సమూల మార్పులు: కేసీఆర్