ఖమ్మం ధర్నాచౌక్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం అలా రక్షణ కల్పిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ,ఎస్టీ చట్టం కేసుల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
తరతరాల అణచివేత నుంచి కాపాడుకునేందుకు పోరాడి తెచ్చుకున్న చట్టం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అని.. పోలీసులు సీపీసీలోని కొన్ని లోసుగులను వినియోగించుకుని రాజకీయ వత్తిళ్లకు లొంగి.. నిందితులతో కుమ్మకై ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రల్లో భాగంగా తమ వారి అమాయకత్వం, పేదరికాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగపరుస్తున్న విషయం వాస్తవమన్నారు. తాము తప్పుడు కేసులకు దూరంగా ఉంటామన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు జరిపేందుకు పోరాడుతామన్నారు. జిల్లాకు చెందిన బాధితులను కలిసి పరామర్శించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ తరగతుల కోసం టీవీలు పంపిణీ చేసిన మంత్రి సబిత