ETV Bharat / state

Crop Procurement in Telangana: పొలం లేదు.. ధాన్యం లేదు.. రూ.కోట్ల పంట విక్రయించారట! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

మామిడి తోటలో వరిసాగు చేసినట్లు ఎక్కడన్నా విన్నారా? ఖమ్మం జిల్లాలోని కొందరు అక్రమార్కులు అలా రికార్డులు సృష్టించారు. సుమారు అర ఎకరం భూమి ఉన్న రైతు నుంచి ధాన్యం కొన్నట్లు చూపి... కోటి రూపాయలు జమ చేశారు. సాగు లేదు.. ధాన్యం పండలేదు.. అంతా సవ్యంగా జరిగినట్లు రికార్డులు సృష్టించారు. లేని వరి పొలం ఉన్నట్లుగా, గుంటల విస్తీర్ణంలోని పొలాన్ని ఎకరాల్లో ఉన్నట్లు నమోదు చేశారు. ఈ మాయాజాలంతో ప్రభుత్వ ఖజానాకు రూ.పదుల కోట్లలో చిల్లు పడినట్లు తెలుస్తోంది.

Crop Procurement in Telangana, telangana crop purchasing
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు
author img

By

Published : Oct 13, 2021, 8:31 AM IST

పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షణలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు సాగుతాయి. కొనుగోలు కేంద్రాల పర్యవేక్షకులు పంపిన వివరాల మేరకు మిల్లుల్లో ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేసిన తరువాత పౌరసరఫరాల సంస్థ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఆ లెక్కలను నమోదు చేయాలి. రైతుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాలను సరిచూసుకుని నిధులు విడుదల చేయాలి. కానీ కొనుగోలు కేంద్రాల్లో ఉండే ధాన్యం రవాణా పత్రాల (ట్రక్‌షీట్స్‌)ను కొందరు పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లకు అందజేశారు. ముందస్తు ఒప్పందం మేరకు ధాన్యం లేకుండానే... అది మిల్లులకు చేరినట్లు నమోదు చేశారు. ఇలా కాజేసిన ప్రభుత్వ సొమ్మును రాజకీయ పెద్దలు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు పంచుకున్నారు.

  • మామిడి తోటలో వరిసాగు చేసినట్లు ఎక్కడన్నా విన్నారా? ఖమ్మం జిల్లాలోని కొందరు అక్రమార్కులు అలా రికార్డులు సృష్టించారు. అక్కడ పండిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు విక్రయించినట్లు చూపారు. ఆ సొమ్మును తిమింగలాల మాదిరి మింగేశారు. కొందరు వ్యవసాయ పరపతి సంఘం పెద్దలు, అధికారులు, మిల్లర్లు మిలాఖత్‌ అయి ఈ ‘గోల్‌మాల్‌’కు తెరతీశారు.
  • సుమారు అర ఎకరం భూమి ఉన్న రైతు నుంచి ధాన్యం కొన్నట్లు చూపి... కోటి రూపాయలు జమ చేశారు. పెద్ద మొత్తంలో ధాన్యం పండినట్లు.. వాటిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినట్లు రాసుకున్నారు. విక్రయాల పేరిట ప్రభుత్వ సొమ్మును బినామీ ఖాతాల్లోకి బదలాయించుకున్నారు. మిల్లులకు తరలించినట్లు రాసి... రవాణా ఖర్చుల మొత్తాన్నీ స్వాహా చేశారు.
  • సాగు లేదు.. ధాన్యం పండలేదు.. అంతా సవ్యంగా జరిగినట్లు రికార్డులు సృష్టించారు. లేని వరి పొలం ఉన్నట్లుగా, గుంటల విస్తీర్ణంలోని పొలాన్ని ఎకరాల్లో ఉన్నట్లు నమోదు చేశారు. అసలు లేని ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు చూపారు. వెరసి... ఒక్క గింజ కూడా లేకుండానే అక్రమార్కులు తప్పుడు లెక్కలతో రూ.కోట్లలో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రాష్ట్రంలో గత యాసంగి సీజనుకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాగిన బాగోతమిది. ప్రాథమిక సమాచారం మేరకు... ఈ మాయాజాలంతో ప్రభుత్వ ఖజానాకు రూ. పదుల కోట్లలో చిల్లు పడినట్లు తెలుస్తోంది.

తవ్విన కొద్దీ అక్రమాలు

ప్రస్తుతానికి నాగర్‌కర్నూల్‌, ఖమ్మం, సిద్దిపేట, జనగాం జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. సిద్దిపేట జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన పలువురి బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి జమ అయినట్లు సమాచారం. రూ.కోటి రావాలంటే కనీసం 5,700 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాలి. అంటే సుమారు 250 ఎకరాల్లో వరి సాగు చేసి ఉండాలి. ఆ కుటుంబానికి అంత పొలం లేదని స్థానికంగా అందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పెద్దలు, అధికారులు, రైస్‌మిల్లర్లు ఈ బినామీ బాగోతానికి సూత్రధారులు.

పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు లేవు. అప్పుడప్పుడు తరుగు విషయంలో మాత్రమే సమస్యలొచ్చేవి. ఈ దఫా ధాన్యం కొనకుండానే కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

- వి.అనిల్‌కుమార్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

ఇదీ చదవండి: Disha Encounter: ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టా? అంటే ఏమిటి? నాకసలు దాని అర్థమే తెలియదు!: సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.