ETV Bharat / state

Maize Farmers Issues At Khammam : 'మంత్రి చెప్పినా కొంటలేరు... ఇప్పుడేం చేయాలి సారు...?' - తెలంగాణ తాజా వార్తలు

Maize Farmers Issues At Khammam : దేవుడు వరమిచ్చినా...పూజారి కనికరించడం లేదన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లాలో రైతుల దుస్థితి. అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెబుతున్న... క్షేత్ర స్థాయిలో సిబ్బంది మాత్రం ధాన్యాన్నికి కోర్రిలు విధించి రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆరుకాలం శ్రమించి పండించిన పంటను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.

Maize farmers
Maize farmers
author img

By

Published : May 17, 2023, 8:11 AM IST

మంత్రి చెప్పిన కొంటలేరు... ఇప్పుడు ఏం చెయ్యాలి సారు...?

Maize Farmers Issues At Khammam : ఖమ్మం జిల్లాలో 90వేల7 వందల తొమ్మిది ఎకరాల్లో మొక్కజోన్నను సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాలకు 40 క్వింటాళ్లు దిగుబడి రావాల్సిన మెుక్కజోన్న కేవలం 25 క్వింటాళ్లకే పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్కెఫెడ్‌ ద్వారా 60 వేల 7 వందల 75 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో...కొందరూ ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మరి కొందరుకొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

మే 31 వరకు అన్ని జిల్లా కేంద్రాలల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో సర్కారు ఆశయం నెరవేరేలాలేదు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి రెవెన్యూ పంచాయతీ పరిధిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ప్రతి గింజ కొంటాం అన్నారు కానీ ఇప్పుడు: ఈ సందర్భంగా సర్కారు ప్రతి గింజ కోంటుందని హామీ ఇచ్చారు. కాగా మార్కెఫెడ్‌ సిబ్బంది ఏమో తేమ శాతం ఎక్కువగా ఉందని, చెత్త ఉందని, రంగు మారిందని ఇలా అనేక కారణాలు చెబుతూ కోర్రిలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. మంత్రి ఏమో ధాన్యం కొంటామని చెబితే సిబ్బంది ఏమో లోపాలు వెతుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి చెప్పిన కొంటలేరు: మార్కెఫెడ్‌ అధికారులు, సిబ్బంది కావాలనే మెుక్కజోన్న కొనుగోలు చేయకుండా తత్సారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి గింజ కొనాలని ప్రభుత్వం ఆదేశించినా పలు కొనుగోలు కేంద్రాలల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'24వ తేదీన మొక్కజొన్న కోపించినా, 3 రోజుల క్రితం మంత్రిగారు వచ్చారు. తడిసిన గింజలు కూడా కొనాలి అని అజయ్​గారు చెప్పారు. స్వయాన మంత్రిగారు చెప్పిన మాటలు కూడా లెక్క చెయ్యకుండా మాకు రూల్స్​ ఉంటాయి. దుబ్బ ఉంటే కొనం అవిఇవి అంటున్నారు. ఆరోజు తడిసిన గింజ కూడా కొంటాం అన్నారు. మంత్రిగారు ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లడలేదు ఇప్పుడు మంత్రిగారు వెళ్లాక మా రూల్స్ మాకుంటాయి అంటున్నారు.'-బాధిత రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.