ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో రామకృష్ణాపురం పంచాయతీ పరిధిలోని శ్రీరామ్ నగర్ తండాలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు.
దీనిపై స్పందించిన డీఆర్వో శిరీష ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే అక్రమంగా రెండు పడక గదుల ఇళ్లల్లోకి ప్రవేశించారని ఆ ముగ్గురు యువకులపై కామేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. ఈ విషయంపై స్థానిక నాయకులు ఎమ్మెల్యే హరిప్రియను కలిసి వారిపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. వారిపై కేసులు కొట్టివేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్' రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు