భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని విజయనగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై పగ పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కొనఊపిరితో నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతున్న వివాహితను స్థానికులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జూలూరుపాడు మండలం గంగారం తండాకు చెందిన బద్రు, బుల్లిలకు చాలా ఏళ్ల క్రితం వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వారం రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడటం వల్ల బుల్లి అలిగి తన తల్లి గారి ఇంటికి వెళ్లింది. భార్యను తీసుకెళ్లేందుకు 3 రోజుల క్రితం భర్త బద్రు కూడా సారపాక వచ్చాడు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం భార్యను కత్తితో దాడిచేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: నకిలీ బంగారంతో మణప్పుఱం సంస్థకు టోకరా