ETV Bharat / state

ఖమ్మంలో అన్నదాతకు మళ్లీ షాకిచ్చిన పోలీసులు

author img

By

Published : Apr 19, 2019, 7:20 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ సరిగా కొనడం లేదు. పంట తీసుకొచ్చినా రోజుల తరబడి పడిగాపులు తప్పలేదు. చివరికి విసిగి వేసారిన ఆ అన్నదాతలు కడుపు మండి రాస్తారోకో చేశారు. అధికారులు వచ్చి వెంటనే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది... కానీ ఇప్పుడా రైతులపై కేసులు నమోదయ్యాయి.

ఖమ్మంలో అన్నదాతకు మళ్లీ షాకిచ్చిన పోలీసులు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్లో 15రోజుల కిందట ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. పలువురు రైతులు తమ పంటను తీసుకొచ్చారు.

నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
ఆర్భాటంగా ఏర్పాటు చేశారు కానీ నత్తనడకన కొనుగోళ్లు జరుగుతున్నాయి. 15 రోజుల్లో ఇక్కడ కేవలం ఎనిమిది మంది రైతుల నుంచి 4419 బస్తాల ధాన్యమే కొనుగోలు చేశారు. అంతకుముందు కొన్న 3,086 బస్తాల ధాన్యం కూడా మిల్లులకు రవాణా చేయలేదు.

నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు
మార్కెట్​కు తీసుకొచ్చి వారం అవుతున్నా.. కొనుగోళ్లు జరగలేదు. ఓపిక నశించిన రైతులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రోడ్డెక్కారు. స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సి.ఎస్.డి.టి. విజయ్ బాబు, పోలీసులు అక్కడకు చేరుకొని సాధ్యమైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలు శాంతించారు.

అన్నదాతలకు షాకిచ్చిన పోలీసులు
రైతుల ఆందోళన వల్ల ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ అభియోగం కింద 13 మంది రైతులపై పోలీసులు సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. తమ ఆక్రోశం తెలియజేయడం కోసం ఇలా ధర్నాకు దిగితే... కేసులు పెట్టడం దారుణమని పోలీసులపై మండిపడుతున్నారు.

రాజకీయ పార్టీల సంగతేంటి..?
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న రాస్తారోకోలపై ఎన్ని కేసులు నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.

ఖమ్మం జిల్లాలో రైతులపై గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మిర్చి ధర పతనంపై రైతులు ధర్నా చేసినందుకు.. కేసులు పెట్టి అన్నదాతకు ఉక్కు సంకెళ్లు వేసి జైలుకు తరలించారు. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది.

ఇవీ చూడండి: మీది ప్రేమేనా... ఓ సారి ఆలోచించుకోండి!

Intro:TG_KRN_102_19_GOOD FRIDAY_PRAYERS_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో శుభ శుక్రవారం ప్రార్థన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హుస్నాబాద్ లోని బేతేలు మందిరం, కర్మెల్ ఫుల్ గాస్పెల్,బిలివర్స్,కర్మెల్,బేతేస్థ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శుభ శుక్రవారం సందర్భంగా యేసు క్రీస్తు ప్రభువుల వారు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హుస్నాబాద్ లోని బేతేలు ప్రార్థన మందిరంలో దైవజనులు వస్కుల శేఖర్ గారు శుభ శుక్రవార దైవ సందేశాన్ని క్రైస్తవ భక్తులకు అందించారు.

Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని

Conclusion:శుభ శుక్రవారం సందర్భంగా పలు ప్రార్థనా మందిరాలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.