రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని... అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో జిల్లా కేంద్రంలోని పేదలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 9, 12వ డివిజన్లలో అనేక అక్రమాలకు పాల్పడి ఇళ్లు ఉన్నవారికే కేటాయించారని ఆరోపించారు.
ఎప్పటి నుంచో పట్టణంలో ఉంటున్న వారికి ఇవ్వకుండా ఇటీవల వచ్చిన వారికి ఇళ్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గ్రామాల్లో ఇళ్లు,పొలాలు ఉండి... పట్టణానికి వచ్చిన వారికి కేటాయించారన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతి పత్రం సమర్పించారు.
ఇవీ చూడండి: వాహ్ తాజ్: ప్రేమాలయం అందాలకు ట్రంప్ ఫిదా