ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలోని ఇసుక వ్యాపారులో ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మున్నేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి ఖాళీ ప్రదేశాలు, ఇళ్లలో నిల్వచేసిన సుమారు 450 ట్రక్కుల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. గంధసిరి గ్రామంలో సుమారు 300లకు పైగా ట్రాక్టర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ట్రక్కు ఇసుక.. రూ.7000
అనుమతులు లేకుండానే ఈ ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక ట్రక్కు ఇసుక ఐదు వేల నుంచి ఏడు వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో.. ఖమ్మం, ముదిగొండ, నేలకొండపల్లి పరిసర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి.. మైనింగ్ అధికారుల సహాయంతో ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల