కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సీపీఎం జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు . తక్షణమే జిల్లాలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సమ్మె సైరన్.. సింగరేణిలో మూడురోజుల నిరసనలు షురూ