లాక్డౌన్ సమయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా తల్లాడ, వైరా మండల కేంద్రాల్లో చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
లాక్‌డౌన్‌ను పోలీసులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు సమయంలో… ప్రజలు గుంపులు గుంపులుగా లేకుండా చూడాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా సీపీతో పాటు వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్ కుమార్, ఎస్సైలు సురేశ్, నరేశ్‌లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా ఫ్రీ విలేజ్.. నేటికీ ఆ గ్రామానికి దరిచేరని వైరస్