వలస కూలీల ఇబ్బందులు తెలుసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షించేందుకు మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏన్కూరులో వలస కూలీల నివాస ప్రాంతాలను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. జన్నారం, హిమాంనగర్, భగవాన్‌నాయక్‌తండాలలో కూలీలతో మాట్లాడారు.
లాక్‌డౌన్ ముగిసే వరకు అందరూ ఇక్కడే ఉండాలని... అవసరమైన వసతులు, వైద్యసదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కూలీలు తమ గోడు డీపీవో ఎదుట వెల్లబుచ్చారు. వీలైనంత త్వరగా తమ రాష్ట్రాలకు వెళ్లే విధంగా దృష్టిపెట్టాలని, ఒక్క నెలరోజు పాటు పనుల కోసం తమ పిల్లలను వదిలేసి వచ్చామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు పంపిణీపై అధికారులు పరిశీలన చేశారు. కొన్ని ప్రాంతాలలో కూలీలు రాలేదని చెప్పగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.