ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లను పిలవకుండా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయని నగర అధ్యక్షుడు ఎండీ జావెద్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను పిలవకుండా.. తెరాస నుంచి ఓడిపోయిన కార్యకర్తల పెత్తనం సాగుతుందని విమర్శించారు.
ఖమ్మం 57వ డివిజన్‌లో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ను ఎందుకు పిలవలేదని ప్రశ్నించినందుకు.. సుడా ఛైర్మన్ విజయ్‌కుమార్ తమ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా కార్పొరేటర్ భర్తపై మరో ఇద్దరు కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సహించేది లేదని... కార్పొరేటర్లు అందరూ కలిసి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.